అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రాబోతోందన్న వార్త వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, సూపర్ హీరో కాన్సెప్ట్‌తో రూపొందించబోతున్నారనే విషయాన్ని చిత్ర బృందం ఇప్పటికే స్పష్టంగా తెలిపింది. దీంతో సినిమాపై ఆసక్తి మరింతగా పెరిగిపోయింది.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రానికి ‘శక్తిమాన్’ అనే టైటిల్‌ను మేకర్స్ పక్కాగా ప్లాన్ చేశారట. ఇది ఇండియన్ ఆడియన్స్‌కు బాగా దగ్గరగా ఉన్న టైటిల్ కావడంతో, అదే పేరు మీద అల్లు అర్జున్ ఒక సూపర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడనే ఊహాగానాలు వస్తున్నాయి. టైటిల్ ప్రకటన కూడా త్వరలోనే జరగబోతుందని సమాచారం.
అలాగే, మరో ఆసక్తికరమైన సంగతి ఏంటంటే… ‘మిన్నల్ మురళి’తో పేరుపొందిన మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్ కూడా అల్లు అర్జున్‌తో ఓ సూపర్ హీరో జానర్‌లో సినిమా చేయబోతున్నారట. ఇదే టైటిల్‌ను దానికోసం కూడా వాడే ప్రయత్నాల్లో ఉన్నారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఈ టైటిల్ ఎవరికి చెందుతుంది, ఏ ప్రాజెక్ట్‌కి అనౌన్స్‌మెంట్ మొదటగా వస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ భారీ సినిమాకు సంబంధించి మరొక క్రేజీ విషయమూ బయటకి వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ఇందులో ప్రధాన పాత్రలో నటించనుండగా, ఈ కాంబినేషన్ చాలా స్టైలిష్‌గా, విభిన్నంగా ఉండబోతోందని చిత్ర వర్గాల టాక్. భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ ఈ సినిమాలో తన గత సినిమాలకు మించిన ఎనర్జీతో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఇంతవరకూ వచ్చిన అప్‌డేట్స్ చూస్తుంటే, ఇది సాధారణ సినిమా కాదని స్పష్టమవుతోంది. ఈ సూపర్ హీరో ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ మీదకి వెళ్లబోతుందోనన్న ఆసక్తితో అభిమానులు ఎదురు చూస్తున్నారు.
