గతేడాది విడుదలైన మలయాళ యూత్ ఫుల్ ప్రేమ కథ”ప్రేమలు”తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు నెస్లన్, తన తదుపరి సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిత్రం “జింఖానా”. కామెడీ మరియు బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. తెలుగులో కూడా రిలీజ్ అయిన ఈ సినిమా, అంచనాల మేరకు ఓ మోస్తరు స్పందనను సొంతం చేసుకుంది.
ఈ చిత్రానికి దర్శకుడు ఖలీద్ రెహమాన్. కామెడీ, ఎమోషన్, స్పోర్ట్స్ మిక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆయన కథను నడిపించారు. ముఖ్యంగా యంగ్ ఆడియన్స్‌కు ఈ సినిమాలో ఉండే హ్యూమర్ మరియు స్పోర్ట్స్ థీమ్ బాగా నచ్చేలా ఉంది.
ఇప్పుడు ఈ సినిమా ఓటిటి ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రాబోతుంది. ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫార్మ్ అయిన సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకుంది. మలయాళం వర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్‌లో కూడా ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షించవచ్చు.
అయితే తాజాగా సోనీ లివ్ వారు ప్రకటించిన ప్రకారం, జూన్ 13 నుంచి “జింఖానా” స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. ఇంట్లోనే కూర్చొని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి ఎంటర్టైన్‌మెంట్‌గా నిలవనుంది.
కామెడీ, యూత్ ఎలిమెంట్స్‌తో పాటు బాక్సింగ్ నేపథ్యంలో నడిచే ఈ సినిమా ఓసారి ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. థియేటర్‌కి వెళ్లి చూడలేకపోయినవారు, ఈసారి ఓటిటిలో మాత్రం మిస్ కాకుండా చూడొచ్చు.
