జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడిపేస్తున్నాడు. ప్రస్తుతం టాప్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పుల్ స్పీడ్‌లో కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. సినిమా టీమ్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తోందట. ఈ పాట కోసం ఎవరిని తీసుకోవాలా అనే విషయంలో మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదట. మొదట రష్మిక మందన్న ఈ స్పెషల్ సాంగ్‌లో కనిపించనుందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం కేతిక శర్మను ఈ స్పెషల్ సాంగ్‌కి తీసుకునే ఆలోచనలో ఉందట చిత్ర బృందం.
ఇటీవల కేతిక శర్మ ‘సింగిల్’ అనే చిత్రంతో మంచి హిట్ అందుకుంది. యూత్‌లో ఆమెకు ఉన్న క్రేజ్‌ను చూసి మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుంటున్నారని టాక్. నిజంగానే కేతిక శర్మ ఎన్టీఆర్ సినిమాలో స్పెషల్ సాంగ్‌కి ఎంపికైతే, అది ఆమె కెరీర్‌కు మంచి బూస్ట్ అవుతుందన్నది అభిమానుల అభిప్రాయం.
అందులోనూ ప్రశాంత్ నీల్ సినిమా కావడం, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అంటే పెద్ద అవకాశం. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి ఆ స్పెషల్ సాంగ్‌లో కేతికనే తీసుకుంటారా లేదా అనే విషయంపై ఉంది.
