పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రాల్లో “సలార్” ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించారు. ప్రభాస్ కెరీర్‌లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవడంతో పాటు, దీనికి సీక్వెల్ కూడా ఉండబోతుందన్న వార్తలు అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తున్నాయి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించగా, ఆయన పాత్రకి మద్దతుగా నిలిచే పాత్రలో ప్రభాస్ కనిపించాడు.
ఇప్పుడు ప్రభాస్ ఒక ఆసక్తికర వ్యాఖ్యను చేశాడు. తాను నటించిన సినిమాలో “సలార్” ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ, నిజజీవితంలో తన సలార్ ఎవరు అన్న విషయం ప్రభాస్ చెప్పిన విధానం అందరినీ ఆకట్టుకుంది. తనకి సలార్ అనిపించే వ్యక్తి ఎవరో కాదు, దర్శకుడు ప్రశాంత్ నీల్‌నేనని తాజాగా పుట్టినరోజు సందర్భంగా అతనిపై ప్రేమతో చెప్పాడు. ప్రశాంత్ నీల్‌కి విషెస్ చెబుతూ, “నీ ఎనర్జీని, ప్యాషన్‌ని మళ్లీ చూడటానికి సలార్ పార్ట్ 2 కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా” అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన సందేశం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ప్రభాస్ పెట్టిన ఈ పోస్ట్ చూసిన అభిమానులు సలార్ 2పై మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై ప్రభాస్ చూపిన ఆప్యాయత, ఆయనకు ఇచ్చిన గౌరవం, అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. ఇక పార్ట్ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఉత్కంఠ సినీప్రేమికుల్లో మొదలైంది.
