కల్ట్ ఫేమస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ రోజుల్లో చాలా చర్చనీయాంశంగా మారారు. ఆయన కొత్త సినిమా ‘స్పిరిట్’ కోసం ప్రీ-ప్రొడక్షన్ పని లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పోలీస్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఉండగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించనున్నాడు. మొదట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పిన విషయం తెలిసిందే. దీపికా స్థానంలో బోల్డ్ బాలీవుడ్ హీరోయిన్ త్రిప్తి డిమ్రీ ని ఈ సినిమాలో తీసుకున్నారు.
ఈ పరిణామం కారణంగా దీపికా, సందీప్ రెడ్డి వంగా మధ్య ఒక వార్ మొదలైంది. బాలీవుడ్ పీఆర్ వారూ ‘స్పిరిట్’ సినిమా గురించి వివిధ రకాల ప్రచారం చేస్తున్నారని, దానికి సందీప్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఒక కథను యాక్టర్ తో మాత్రమే పంచుకున్నప్పుడు అది బయటకు రావడం మానుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ ఈసారి ఆ నమ్మకం హీరోయిన్ వల్ల గల్లంతైందని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పుడు సందీప్ రెడ్డికి పెద్ద టాస్క్ ఉంది. బాలీవుడ్ పీఆర్‌ల నోటిని మూసివేసేందుకు ‘స్పిరిట్’ సినిమాను పెద్ద విజయం చేసుకోవాల్సి ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే పీఆర్ ప్రచారాలు మౌనంగా మారిపోతాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఈ వార్ లో సందీప్ రెడ్డి ఎంత పెద్ద విజయం సాధిస్తారో చూడాలి.
https://x.com/imvangasandeep/status/1927064054515867817
