దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని నిర్మిస్తున్న “మిరాయ్” సినిమాలో తేజ సజ్జతో పాటు రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రం చాలా నెలలుగా నిర్మాణం లో ఉంది. తాజాగా ఈ సినిమా టీజర్ మే 28, 2025న విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. టీజర్ రిలీజింగ్ కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు, కానీ ఇందులో సినిమా విడుదల తేదీ చూపించలేదు.
ఇప్పటికే ఆగస్టు 1, 2025న ఈ సినిమా థియేటర్లకు రానుందా లేక రిలీజ్ తేదీ మారుతుందా అనే ఉత్కంఠ కూడ ఉంది. కథనం ప్రకారం, సినిమా మొత్తం మనోజ్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్ర చాలా వైల్డ్ గా ఉండబోతుందని, అందుకే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ క్యారెక్టర్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేశాడు. ఇటీవల మనోజ్ పుట్టినరోజు సందర్భంలో విడుదలైన గ్లింప్స్ వీడియోలో ఆయన యాక్షన్ లుక్, కత్తి పట్టుకుని ‘ది బ్లాక్ స్వార్డ్’ గా కనిపించారు. ఈ సినిమాలో సంగీతం గౌర హరీష్ అందిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
