మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇపుడు చేస్తున్న పలు చిత్రాల్లో తన మొదటి బాలీవుడ్ చిత్రం “వార్ 2” కూడా ఒకటి. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ స్టన్నింగ్ యాక్షన్ డ్రామా చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ కి అనూహ్య స్పందన వచ్చింది. ఇక ఈ తర్వాత నుంచి మేకర్స్ మరింత యాక్టీవ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ఇలా లేటెస్ట్ గా దర్శకుడు అయాన్ ముఖర్జీ షేర్ చేసిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ వైరల్ గా మారాయి.
అయితే వీటిలో మొదటిగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తోనే సెట్స్ లో కనిపిస్తోంది. ఎన్టీఆర్ కి సన్నివేశాన్ని వివరిస్తున్నట్టుగా కనిపిస్తున్న ఈ పిక్ లో ఎన్టీఆర్ మంచి డాషింగ్ లుక్ లో ఉన్నారని చెప్పాలి. మరి ఈ సినిమాకి తన వర్క్ ఎక్స్ పీరియన్స్ ని కూడా అయాన్ పంచుకున్నాడు. వార్ 2 స్క్రిప్ట్ తనని ఎంతో కదిలించింది అందుకే ఈ సినిమా డైరెక్షన్ ఒప్పుకున్నానని చెప్పుకొచ్చారు.
