టాలీవుడ్ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. మరి కిరణ్ అబ్బవరం హీరోగా రీసెంట్ గానే ‘క ర్యాంప్’ సినిమా స్టార్ట్ చేశాడు. అయితే దీనికి ముందే తన భార్య హీరోయిన్ రహస్య గర్భవతి అనే గుడ్ న్యూస్ ని షేర్ చేసుకొని అతి త్వరలోనే తాము తల్లిదండ్రులు అవుతున్నామనే వార్త షేర్ చేసిన సంగతి తెలిసిందే.
మరి ఈ ఆనందం హనుమాన్ జయంతి నాడు రెట్టింపు అయ్యింది. ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకొని హనుమాన్ జయంతి నాడు పండంటి మగ బిడ్డకి తన భార్య జన్మనిచ్చినట్టు చెప్పారు. దీంతో ఈ పిక్ చూసిన ఫాలోవర్స్ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
