పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి – జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌తో నిర్వహిస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ చిత్రం నుండి మూడో సింగిల్ సాంగ్‌గా ‘అసుర హననం’ అనే పాటను లాంచ్ చేశారు.
ఈ సాంగ్ లాంచ్ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించి చిత్రానికి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఈ సినిమాలోని ఓ ఐటెం సాంగ్ గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఉందని.. ‘తార సితార’ అంటూ సాగే ఈ పాటలో కొన్ని లైన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని పవన్ సూచించారంట.. ఆయన ప్రస్తుతం ఏపీకి బాద్యతాయుతమైన పదవి ని నిర్వహిస్తున్నారు. దాంతో ఇలాంటి లైన్స్ వాడకూడదని అన్నారు. వాటిని మార్పించి ఆ తర్వాత తిరిగి సాంగ్ రికార్డింగ్ చేయించినట్లు కీరవాణి చెప్పుకొచ్చారు.
ఇలా తన పదవి పట్ల నిబద్ధతగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రేక్షకులు ఎలాంటి సినిమా తన నుంచి కోరుకుంటారో అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసని కీరవాణి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా నుంచి నెక్స్ట్ రాబోయే పాట ఇదే కావచ్చని అభిమానులు భావిస్తున్నారు.
