జగన్ గన్‌మెన్ ఇచ్చిన మరో దందారాయుడు ఇతడే!

Friday, December 5, 2025

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమానాలో విచ్చలవిడిగా అరాచకంగా వ్యవహరిస్తూ అనేక బెదిరింపులు, వసూళ్ల పర్వం నడిపించిన బోరుగడ్డ అనిల్ గురించి అందరికీ తెలుసు. తల్లికి అనారోగ్యంగా ఉన్నదని నకిలీ మెడికల్ సర్టిఫికెట్లు పుట్టించి దొంగ బెయిలు పొందిన బోరుగడ్డ అనిల్, ఇటీవల మరోసారి బెయిలు పొంది ప్రస్తుతం బయట ఉన్నారు. అయితే.. ఆయన గతంలో తాను అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సలహాదారును అంటూ.. తనను విచారించిన పోలీసులనే బెదిరించిన సంగతి కూడా ప్రజలకు తెలుసు. అలాంటి రౌడీషీటరుుకు జగన్ సర్కారు అప్పట్లో గన్ మెన్ ను కూడా ఏర్పాటుచేసింది. గన్ మెన్ ను వెంటబెట్టుకుని బోరుగడ్డ అనిల్ రౌడీయిజం చేయడానికి, బెదిరింపులకు, వసూళ్లకు వెళ్లేవాడని ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది.

ఇప్పుడు సేమ్ టూ సేమ్ అలాంటిదే మరో అరాచకం వెలుగులోకి వస్తోంది. లిక్కర్ స్కామ్ లో నిందితుల జాబితా, మూడున్నర వేల కోట్ల రూపాయల ఆ కుంభకోణంతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న వారి జాబితా రోజురోజుకూ పెరిగిపోతున్న నేపథ్యంలో తాజాగా వెలుగులోకి వచ్చిన పేరు హనుమంతరెడ్డి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు అయిన ఆయన డిస్టిలరీల ప్రతినిధుల్ని తుపాకీ చూపి బెదిరించి మరీ.. తాము అడిగిన ముడుపులు, వాటాలు సమర్పించుకుని.. వ్యాపారం చేసుకోవాలని హెచ్చరించినట్టుగా ఆల్రెడీ విచారణలో బయటకు వచ్చింది. అలాంటి హనుమంత రెడ్డికి జగన్ సర్కారు గతంలో గన్ మెన్ ను కూడా సమకూర్చిన వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.

2019 లో జగన్ సర్కారు ఏర్పడిన వెంటనే.. సదరు హనుమంతరెడ్డికి తుపాకీ లైసెన్సు ఇచ్చారు. తాను తుపాకీ చూపించి బెదిరించడం ఒక్కటీ తన దందాలకు చాలదని ఆయన భావించారేమో తెలియదు.. రెండేళ్ల తరువాత అంటే 2022లో ప్రభుత్వం ద్వారా గన్ మెన్ ను కూడా తీసుకున్నారు. తన వెంట గన్  మెన్ ను తీసుకువెళ్లి.. దందాలుచేస్తే అవతలి వాళ్లు సులభంగా భయపడి లొంగుతారనేది ఆయన వ్యూహం కావొచ్చు. ఆ రకంగా.. హనుమంతరెడ్డి దందాలకు జగన్ సర్కారు తమ శక్తివంచన లేకుండా ప్రోత్సాహం అందించినట్టు కనిపిస్తోంది. బహుశా అందుకు ప్రత్యుపకారంగానేమో.. మద్యం కుంభకోణంలో ఒక పట్టాన వాటాలు ముడుపులుగా సమర్పించడానికి లొంగని డిస్టిలరీల యజమానుల్ని తుపాకీ చూపించి మరీ బెదిరించడం ద్వారా హనుమంతరెడ్డి- జగనన్న కళ్లలో ఆనందం చూడడానికి ప్రయత్నించారేమో అని అనిపిస్తోంది.

గన్ లైసెన్స్ మరియు గన్ మెన్ కూడా ఉండడంతో హనుమంతరెడ్డి అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయి రియల్ ఎస్టేట్ దందాలు, సెటిల్మెంట్లు చేసినట్టుగా తెలుస్తోంది. తమాషా ఏంటంటే.. ఇన్ని దందాలు వెలుగులోకి వచ్చినా సరే.. కూటమి ప్రభుత్వంలో కూడా అతని గన్ లైసెన్సు మాత్రం రద్దు కాలేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles