పుట్టిన రోజు కానుక!

Friday, December 5, 2025

ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న భారీ ప్రాజెక్టులలో ఒకటి వార్ 2. ఈ సినిమాలో హృతిక్ రోషన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇద్దరు పెద్ద స్టార్‌లు కలిసి వస్తుండటంతో ఈ చిత్రంపై ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ఈ సినిమాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులను ఉత్సాహపెట్టే ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి బయటకి వచ్చింది. మే 20న ఈ చిత్రానికి సంబంధించిన ఒక కీలక అప్డేట్ రానుందని బజ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు జోరుగా చక్కర్లు కొడుతోంది.

ఆ పోస్ట్ లో హృతిక్ ఎన్టీఆర్‌ను ట్యాగ్ చేస్తూ, మే 20న ఏం వస్తుందో నీకు అర్థం కాదు, అయితే అది చాలా స్పెషల్ అంటూ సంకేతంగా చెప్పాడు. దీంతో ఈ డేట్ మీద వార్ 2 టీజర్ రిలీజ్ కన్‌ఫర్మ్ అయ్యిందన్న భావన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లో ఏర్పడింది.

ఇక తారక్ అభిమానులు ఈ పోస్టుతో ఫుల్ ఎగ్జైట్ అయ్యారు. వార్ 2కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, బాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇది స్పై యాక్షన్ యూనివర్స్‌లో వచ్చే మరో భారీ ప్రాజెక్ట్ కావడం విశేషం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles