లిక్కర్ స్కామ్ లో కొత్త దోపిడీని బయటపెట్టిన మంత్రి!

Friday, December 5, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కాలంలో లిక్కర్ కుంభకోణం రూపేణా జరిగిన అసలు దోపిడీ ఎంత? కేవలం డిస్టిలరీ లనుంచి ప్రతినెలా వాటాల రూపంలో వసూలు చేసిన మొత్తం మాత్రమేనా? దానిని మించి మరే ఇతర రూపాల్లో కూడా దోచుకోవడం జరిగిందా? అనే సందేహాలు రేకెత్తేలాగా ప్రస్తుత ఎక్సయిజు మంత్రి కొల్లు రవీంద్ర కొత్త సంగతులను బయటపెడుతున్నారు. 3500 కోట్ల రూపాయల సొమ్ములు కాజేసిన అతిపెద్ద కుంభకోణంగా లిక్కర్ స్కామ్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే.. మరో 671 కోట్ల రూపాయల అవినీతి కూడా జరిగినట్టుగా కొల్లు రవీంద్ర వివరాలు వెల్లడిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వేల కోట్లరూపాయల లిక్కర్ స్కామ్ కు ప్రధాన సూత్రధారి, అంతిమ లబ్ధిదారు మొత్తం జగన్మోహన్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. సిట్ విచారణలో ఆయన పాత్ర, ఆయన అనుచరుల పాత్ర బయటకు వస్తున్న నేపథ్యంలో  తన సొంత మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారంటూ ఆరోపణలు కురిపించారు. అయితే ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర బయటపెట్టిన కొత్త దోపిడీ పర్వం కూడా  ఒకటుంది.

జగన్ హయాంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే స్వయంగా నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడికేదో.. ప్రెవేటు వ్యక్తులకు ఆ లాభాలను ఇవ్వడం తనకు  ఇష్టం లేదన్నట్టుగా, ప్రతిరూపాయీ ప్రభుత్వ ఖజానాకే చెల్లుబాటు కావాలని సంకల్పిస్తున్నట్టుగా జగన్ అనేక బిల్డప్పులు ఇచ్చారు. కానీ ఇలా ప్రభుత్వ దుకాణాల నిర్వహణ రూపంద్వారా మాత్రమే ఆయన నెలకు డస్టిలరీలనుంచి 50-60 కోట్ల రూపాయల వంతున వాటాలు వసూళ్లు చేయడం సాధ్యమైందనేది ఇప్పటిదాకా తెలిసిన స్కామ్.
అయితే మద్యం దుకాణాల నెలసరి అద్దె 30 నుంచి 40 వేల రూపాయలు మాత్రమే కాగా.. వీటికి రూ.లక్షన్నర నుంచి రెండు లక్ష్లల వరకు అద్దెలు చెల్లించినట్టుగా రికార్డ్లుల్లో చూపించారుట. అంటే ఆ డిఫరెన్స్ అమౌంట్ మొత్తం వైసీపీ పెద్దలు దోచుకున్నారన్నమాట. ఈ అద్దెల కుంభకోణంలో దాదాపు 671 కోట్ల రూపాయలు దోచుకున్నట్టుగా మంత్రి కొల్లు రవీంద్ర గణాంకాలు చెబుతున్నారు. అదే విధంగా.. 202 నాటికి రాష్ట్రంలో 2993 మద్యం దుకాణాలు మాత్రమే ఉండగా.. వాటి సంఖ్యను 3396కు పెంచి.. మద్యనిషేధంలో భాగంగా దుకాణాల సంఖ్య తగ్గించినట్టుగా జగన్ ప్రచారం చేసుకున్నారని కూడా కొల్లు రవీంద్ర ఎద్దేవా చేస్తున్నారు.

మొత్తానికి తనకు అత్యంత విశ్వసనీయులు అయిన కృష్ణమోహన్ రెడ్డి,  ధనుంజయరెడ్డిలకు బెయిలు కూడా దక్కని పరిస్థితుల్లో జగన్ ఈ ఆరోపణల నుంచి ఎలా తప్పించుకోగలరో చూడాలి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles