పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలను ఒక్కొటిగా పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు చిత్రాన్ని పూర్తిచేసిన ఆయన, ఇప్పుడు ఓజీ సినిమాపై పూర్తి దృష్టి పెట్టాడు. ఒక్క సినిమా పూర్తి చేసి, వెంటనే మరో సినిమాకు షూటింగ్ షెడ్యూల్ కేటాయిస్తూ తన ప్రాజెక్టులను తక్కువ సమయంలో ముగించాలని చూస్తున్నాడు.
ఇప్పుడు పవన్ ఫోకస్ అంతా ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను కూడా ఆయన వేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు. అందుకోసమే పవన్ ఈ సినిమాకు ఎక్కువగా డేట్స్ కేటాయించినట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఈసారి ఎలాంటి తడబడులు లేకుండా సినిమా షూటింగ్‌ను ప్లాన్ చేస్తున్నాడట. జూన్ 12 నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ఫ్యాన్స్‌కి మంచి వినోదం ఇవ్వాలన్న ఉద్దేశంతో హరీష్ శంకర్ ప్రతీ విషయంలో క్లియర్ ప్లాన్‌తో ముందుకెళ్తున్నాడు. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటించనుండగా, సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా పైన అభిమానులలో ఇప్పటికే మంచి అంచనాలున్నాయి.
