‘అఖండ 2’లో ఈ స్పెషల్ ఎలిమెంట్

Friday, December 5, 2025

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న భారీ సినిమా అఖండ 2‌పై సినిమాల ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పనులు వేగంగా జరగుతున్నాయి. అయితే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అంశం బయటకు వచ్చింది.

బాలయ్య, బోయపాటి సినిమాల్లో ఆయుధాలకి ఉన్న ప్రత్యేక స్థానం తెలిసిందే. వీరి కాంబినేషన్ లో వస్తున్న ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకమైన ఆయుధం కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అఖండ సినిమాలో అఘోర గెటప్‌లో బాలయ్య చేత పట్టిన త్రిశూలం ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ వేసింది. ఆ త్రిశూలం డిజైన్, బోయపాటి చూపించిన స్టైల్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కి గుర్తుండేలా ఉంది.

ఇప్పుడు అఖండ 2 కోసం అదే త్రిశూలానికి అప్‌గ్రేడ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈసారి ఆ ఆయుధాన్ని మరింత గ్రాండుగా, కొత్తగా చూపించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయించినట్టు సమాచారం. మైథాలజీ తాచ్ తో పాటు మోడరన్ లుక్ కూడా ఇందులో కలిపారని తెలుస్తోంది.

ఇలాంటి ఆసక్తికర అంశాలతో అఖండ 2 లో బాలయ్య ఏ లుక్‌లో కనిపిస్తాడో, ఈ కొత్త ఆయుధం ఎలా చూపించబడుతుందో చూడాలని అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles