అదిరిపోయే అప్డేట్!

Friday, December 5, 2025

టాలీవుడ్‌లోకి సూపర్ హీరో సినిమాలను పరిచయం చేసిన దర్శకుల్లో ప్రశాంత్ వర్మకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన రూపొందించిన హను మాన్ సినిమా తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలోనూ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ సినిమాతో ప్రేక్షకులు ఆశించినంతకన్నా ఎక్కువగా ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది.

ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న జై హనుమాన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి ఏర్పడింది. ఈసారి టైటిల్ రోల్‌ను కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన టాలెంటెడ్ హీరో రిషబ్ శెట్టి పోషిస్తున్నాడు. దీనివల్ల ఈ ప్రాజెక్ట్‌కి మరింత హైప్ పెరిగింది.

ఇంకా ఈ సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకోవడం టాలీవుడ్‌ ఆడియెన్స్‌లో ఒక పాజిటివ్ వైబ్‌ను కలిగిస్తోంది. అంతే కాదు, ఇప్పుడు మరో కీలకమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రానికి జాయిన్ కావడం జరిగింది. ఆయన సమర్పణలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది అన్న సమాచారం ఫిల్మ్ సర్కిల్‌లో హల్‌చల్ చేస్తోంది.

ఇంత పెద్ద బ్యాక్‌గ్రౌండ్‌తో జై హనుమాన్ తెరకెక్కుతుండటంతో, ఈ సినిమా మరింత భారీ స్థాయిలో రూపొందనుందని అంచనాలు పెరిగిపోయాయి. త్వరలోనే సినిమా షూటింగ్ పూర్తి స్థాయిలో ప్రారంభం కాబోతుందని తెలుస్తోంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles