బాలీవుడ్ హీరో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జాట్’ అనే చిత్రం హిందీ ప్రేక్షకుల్లో మంచి మార్క్స్ కొట్టేసింది. టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని రూపొందించిన ఈ సినిమా, థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మాస్ ఆడియెన్స్‌కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఈ సినిమా, థియేటర్ వేదికగా దుమ్ము రేపింది.
ఇప్పుడు థియేటర్ విడుదల పూర్తయిన తర్వాత, ఈ సినిమాను ఓటిటీలో చూసేందుకు చాలామంది వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, జాట్ సినిమాను జూన్ 5 నుంచి ఓటిటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారని ఇండస్ట్రీ టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఈ డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.
ఈ చిత్రానికి స్ట్రీమింగ్ హక్కులు నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుందని ముందే స్పష్టమైంది. అయితే సినిమాను ప్రస్తుతం హిందీ భాషలోనే స్ట్రీమ్ చేయనున్నారని సమాచారం. ఇతర భాషలపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇకపోతే, మొదటి భాగం విజయవంతం కావడంతో మేకర్స్ సీక్వెల్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో జాట్ అభిమానుల ఉత్సాహం మరింత పెరిగిపోయింది.
