రాజ్ కెసిరెడ్డిని వైసీపీ పెద్దలే ఇరికించారట!

Friday, December 5, 2025

దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయల ముడుపులు కాజేసిన లిక్కర్ స్కామ్ లో అసలు అంతిమ లబ్ధిదారులు ఎవరు? వారికి ముడుపులు ముట్టజెప్పిన పాత్రధారులు ఎవరు? తదితర విషయాలన్నీ అధికారికంగా ఇంకా నిరూపణ కాలేదు గానీ..  ప్రజలందరికీ తెలిసిపోయింది. అయితే ఇంకా అనేకమందిని విచారించాల్సి ఉన్న, కీలక నిందితులు ఇంకా పరారీలో ఉన్న ఈ కేసులో  ఏ1 నిందితుడిగా కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి రిమాండులో ఉన్నారు. అయితే ఆయన న్యాయవాదులు.. అనగా ఆయన తరఫు వ్యక్తులు మాత్రం వైసీపీ పెద్దలే రాజ్ కెసిరెడ్డిని ముంచేశారని భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మద్యం కుంభకోణంలో పెద్ద వ్యక్తులను తప్పించి.. రాజ్ కెసిరెడ్డిని ప్రధాన నిందితుడిగా పెట్టారని ఆయన న్యాయవాది అనుదీప్ ఆరోపిస్తున్నారు.

రాజ్ కెసిరెడ్డి వైసీపీ నాయకులకు సన్నిహితంగా మెలిగారే తప్ప.. ఆ పార్టీతో సంబంధం లేదని అంటున్నారు. ఆయన ఒక సెఫాలజిస్టు అని, రాజకీయ నాయకులపై ప్రజాభిప్రాయాలను సేకరించి సర్వే నివేదికలు ప్రచురించే వారని.. అంటున్నారు. ఆయన న్యాయవాది అనుదీప్ చెబుతున్న వివరాలన్నీ నిజమే కావొచ్చు గాక.. కానీ.. పెద్దలను తప్పించి.. రాజ్ కెసిరెడ్డి ని ఏ1 గా పెట్టారని ఆరోపిస్తున్న వారు.. అసలు ఆ పెద్దలెవ్వరో స్పష్టంగా పోలీసులకు చెప్పేస్తే పోతుంది కదా.. అనేది ప్రజల అనుమానంగా ఉంది.

రాజ్ కెసిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన తొలిరోజున.. జగన్ పురమాయింపు మేరకే.. పార్టీకి భారీగా నిధులు రాబట్టడం కోసం.. దండిగా ముడుపులు అందేలా మద్యం కొత్త పాలసీని రూపొందించినట్టుగా ఆయన పోలీసులకు వెల్లడించినట్టు రిమాండ్ రిపోర్టు తయారైంది. అయితే అదే రిమాండు రిపోర్టు మీద రాజ్ కెసిరెడ్డి సంతకాలు మాత్రం చేయలేదు. ఇప్పుడు పెద్దలను తప్పించి.. ఆయనను  ఇరికించారని రాజ్ న్యాయవాది ఆవేదన వ్యక్తం చేసే బదులుగా.. అసలు ఆ పెద్దలెవరో.. ఎవరి పాత్ర ఏమిటో స్పష్టంగా చెప్పేస్తే.. ఆయన సులువుగానే బయటపడతారు కదా అనేది ప్రజల సందేహం.
మద్యం కుంభకోణంతో రాజ్ కెసిరెడ్డికి ఏమాత్రం సంబంధం లేదని ఆయన అమెరికాలో సంపాదించిన డబ్బుతోనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని న్యాయవాది చెబుతున్నారు. ఈ వాదనతో రాజ్ కెసిరెడ్డి మరింతగా ఇరుక్కునే ప్రమాదం ఉంది. అమెరికాలో సంపాదన అంటే.. ప్రతిరూపాయికీ లెక్క పక్కాగా ఉంటుంది. అది ఎప్పుడు ఎలా ఇండియాకు వచ్చిందో.. ఎలా ఇండియాలో పెట్టబడులుగా మారిందో ఆయన నిరూపించుకోవాలి. లేదా అది మరో నేరం అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles