తమిళ నటుడు మరియు దర్శకుడిగా గుర్తింపు పొందిన ప్రదీప్ రంగనాథన్‌కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. యువతను ఆకట్టుకునే కథలతో సినిమాలు చేస్తూ, తనదైన శైలిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నారు. ఇటీవలే ఆయన నటించిన “డ్రాగన్” అనే సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది.
ఈ విజయంతో మరింత జోష్‌లో ఉన్న ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మరో కొత్త సినిమాను మొదలుపెట్టారు. కీర్తి శ్వరణ్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఆయన నటించనున్న ఈ చిత్రానికి “డ్యూడ్” అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ పేరుకు తగ్గట్టుగా సినిమా కూడా యూత్‌ఫుల్ కంటెంట్‌తో రానుందని టాక్.
ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇందులో మలయాళ హీరోయిన్ మమితా బైజు ప్రదీప్‌కు జోడిగా నటిస్తోంది.
సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా, దీపావళి సందర్భంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
ప్రదీప్ సినిమాలు ఎప్పుడూ నవ్యతతో, వినోదంతో ముందుకొస్తాయని అభిమానుల్లో నమ్మకం ఉంది. ఇప్పుడు “డ్యూడ్” సినిమాతో ఆయన ఏం చూపించబోతున్నారో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది.
