విశ్వంభరతో మ్యాజిక్‌ చేస్తారా!

Friday, December 5, 2025

మెగాస్టార్ చిరంజీవి సినిమా కెరీర్‌లో ఫాంటసీ తరహా చిత్రాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి. ఈ జానర్‌లో ఆయన చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో ఎప్పుడూ ఓ ప్రత్యేక ఆకర్షణ ఉంటుంది. ఒకప్పుడు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’తో కొత్త విభాగాన్ని మన సినీ ప్రియులకు పరిచయం చేసిన చిరంజీవి, తర్వాత ‘అంజి’ వంటి చిత్రంతో ఫాంటసీ సినిమాలంటే చిరంజీవి ఉంటేనే బాగా నడుస్తుందన్న నమ్మకాన్ని బలపరిచారు.

ఇటీవల ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మళ్లీ థియేటర్లలో విడుదల కావడంతో ప్రేక్షకులు అదే ఉత్సాహంతో ఆదరించడం చూస్తే, మెగాస్టార్ ఫాంటసీ మూవీస్‌కు ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. ఈ రీ-రిలీజ్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది, దీంతో ఇప్పుడు మెగా అభిమానుల దృష్టంతా ఆయన చేస్తున్న నూతన ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ పై నిలిచింది.

ఇప్పటికే విడుదలైన చిన్న గ్లింప్స్‌కి మిశ్రమ స్పందనలు వచ్చినా, చిరంజీవి సరైన ఫాంటసీ కథలో మెరిస్తే ఆ విమర్శలు ఏమాత్రం ప్రభావితం చేయవు. ఆయనకు ఈ జానర్ బాగా సూటవుతుంది కాబట్టి, విశ్వంభర కథ బలంగా ఉంటే మరి అది ప్రేక్షకులను థియేటర్లకు అట్రాక్ట్ చేయడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమానియువ దర్శకుడు వశిష్ఠ   తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అతను తన మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కాబట్టి, చిరంజీవితో కలసి ఈ ఫాంటసీ చిత్రాన్ని ఎలా తీర్చిదిద్దుతాడో అన్న ఆసక్తి ప్రేక్షకులలో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈసారి కూడా మెగాస్టార్ తన స్టైల్‌కి తగ్గ కథ, విజువల్స్‌తో వెండితెరపై మెరిసితే, ‘విశ్వంభర’ కూడా మరోసారి తెలుగు ఫాంటసీ సినిమాల స్థాయిని పెంచే అవకాశం ఉంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles