టాలీవుడ్లో పవన్ కళ్యాణ్ సినిమాలంటేనే ప్రేక్షకుల్లో ఒక రేంజ్ ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం అందరి చూపులూ అతను చేస్తున్న కొత్త సినిమా ఓజీ మీద పడుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఇప్పుడు మరోసారి హైలైట్‌గా మారింది.
ఎప్పటి నుంచో పవన్ డేట్స్ కోసం వెయిట్ చేస్తోన్న టీమ్‌కి ఇప్పుడు గుడ్ న్యూస్ వచ్చింది. మే 14 నుంచి పవన్ షూటింగ్లో పాల్గొనబోతున్నారట. అంతేకాదు, ఈ నెల చివరిదాకా ఈ ప్రాజెక్ట్ కోసం ఆయన పూర్తి సమయాన్ని కేటాయించనున్నట్టు టాలీవుడ్ వర్గాల టాక్.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. DVV ఎంటర్టైన్మెంట్స్ ఈ ప్రాజెక్ట్‌ని గ్రాండ్‌గా నిర్మిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం పవన్ స్టైల్ మళ్లీ థియేటర్స్‌లో ఎలా ఉంటుందో చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇది చూసితే ఓజీ పవన్ ఫ్యాన్స్‌కి ఈ ఏడాది మెమొరబుల్ సినిమాగా మిగలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
