కోహ్లీ బయోపిక్‌ తో శింబు!

Friday, December 5, 2025

ఇండియన్ స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఓ చాట్ షోలో మాట్లాడుతూ, సిలంబరసన్ టీఆర్(శింబు) నటించిన “పత్తు తల” సినిమా నుంచి “నీ సింహం దాన్” పాటను చాలా ఇష్టపడతానని చెప్పారు. ఈ పాటను సోషల్ మీడియా రీల్స్‌లో, క్రికెట్ వీడియోల్లో చాలా సార్లు వాడుతున్నారు కూడా.

ఆర్‌సీబీ పోస్టులో విరాట్ కోహ్లీని ట్యాగ్ చేయడంతో STR కూడా స్పందించి, “నీ సింహం దాన్” అంటే “నువ్వు నిజమైన సింహం” అని వ్యాఖ్యానించారు. STR,  విరాట్ అభిమానులు ఈ అరుదైన కాంబోను తెరపై కాదు గానీ తెర వెలుపల కూడా ఆనందిస్తున్నారు.

ఇక్కడితో అయిపోలేదు. ఈ ఇద్దరు తమ ప్రత్యేకమైన బియర్డ్ స్టైల్ లో ఆకట్టుకున్నారు. STR తన ఫిట్‌నెస్‌ను పెంచుకోవడంతో, అతని లుక్ కొంతవరకు విరాట్ కోహ్లీని తలపిస్తోంది. STR, విరాట్ కోహ్లీ బయోపిక్‌లో అతడి పాత్ర పోషించబోతున్నాడా అని ముంబయి వర్గాల్లో ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

ఇటీవల వీరి మధ్య సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం.. విరాట్, అనుష్క ప్రొడ్యూసర్లకు ఓకే అంటే STR ఈ బయోపిక్‌కు ఎంపిక అయ్యే అవకాశముంది. దీనికి విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా చేరితే, ఇది పాన్ ఇండియా స్థాయిలో ఓ పండుగ అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles