న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ ‘హిట్-3’తో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తీర్చిదిద్దుతుండగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాపై నాని లేటెస్ట్ కామెంట్స్ వైరల్‌గా మారాయి.
ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని నాని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాతో తాను చెప్పిన మాట నెరవేరబోతుందని నాని తాజాగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హిట్-3 ఫైనల్ కాపీ చూసిన నాని ఈ సినిమాపై పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాతో ప్రేక్షకులకు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తానని నాని తాజాగా ట్వీట్ చేశాడు.
ఇక ఈ సినిమాలో నాని సరసన అందాల భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు.
