ఇక్కడ హైకోర్టు అయితే.. తన అతి తెలివితేటలు, అనుసరించిన వక్రమార్గాల గురించి పుట్టుమచ్చలతో సహా క్లారిటీ ఉన్న వ్యవస్థ కాబట్టి.. వీరిని బైపాస్ చేసి ఏకంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తే బెయిలు వచ్చేస్తుందని ఆయన భ్రమపడ్డట్టుగా ఉంది. కానీ.. న్యాయవ్యవస్థ అనుసరించే చట్టాలు ఎక్కడైనా ఒక్కటే అని, వారిని బురిడీ కొట్టించడం అంత ఈజీ కాదనే సింపుల్ లాజిక్ ను ఆయన మిస్సయినట్టుగా కనిపిస్తోంది. బెయిలుకోసం బోరుగడ్డ అనిల్ కుమార్ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా దానిపై విచారణకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారం హైకోర్టులో ఉన్నందున.. ఆ సంగతి అక్కడే తేల్చుకోవాలని ఆదేశించింది.
వివిధ కేసుల్లో అరెస్టు అయిన బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండులో ఉన్నారు. గతంలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, సర్జరీ చేయించాల్సి ఉన్నదని గుంటూరులోని రాఘవశర్మ అనే డాక్టరు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ను ఆయన కోర్టులో సమర్పించి బెయిలు పొందారు. తర్వాత విచారణలో ఆయన అసలు తల్లి అడ్మిట్ అయిన అపోలో ఆస్పత్రికి ఒక్కసారి కూడా వెళ్లనేలేదని సీసీ టీపీ ఫుటేజీల ద్వారా తేలింది. అలాగే.. ఆయన హైకోర్టుకు సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ కూడా నకిలీది అని తేలింది. ఈ విషయం కోర్టు సీరియస్ అయింది.
ఆ మెడికల్ సర్టిఫికెట్ తాను ఇవ్వలేదని తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని పేర్కొంటూ రాఘవ శర్మ ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణించిన హైకోర్టు అదే వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ఎదుట తీసుకోవాలని సీఐడీ పోలీసుల్ని ఆదేశించింది. మరోవైపు బోరుగడ్డ అనిల్ కుమార్ మరోమారు హైకోర్టులో బెయిలు కోసం పిటిషన్ వేశారు. అయితే.. గతంలో సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీదో కాదో తేలకుండా.. కొత్త బెయిలు పిటిషన్ పరిశీలించలేం అని హైకోర్టు తెగేసి చెప్పేసింది.
అయితే నకిలీ మెడికల్ సర్టిఫికెట్ ఆరోపణలతో సంబంధం లేకుండా.. తన ప్రధాన బెయిల్ పిటిషన్ ను విచారించేలా.. హైకోర్టును ఆదేశించాలని బోరుగడ్డ అనిల్ కుమార్ సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు వ్యాఖ్యానిస్తూ.. నకిలీ పత్రాలతో గతంలో బెయిలు పొందినట్లు తేలితే.. అది ఖచ్చితంగా కొత్త బెయిలుపిటిషన్ పై ప్రభావం చూపిస్తుందని అన్నారు. ఆ సంగతి తేల్చుకోకుడా.. ప్రధాన బెయిలు పిటిషన్ పై విచారణ జరపాలని ఆదేశించాలన్న నిందితుడి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా.. పిటిషన్ ను తిరస్కరించింది.
నకిలీ సర్టిఫికెట్లు హైకోర్టునే మోసం చేసి బెయిలు పొందడం అనేది చాలా తీవ్రమైన సంగతి. ఆ విషయం నిర్ధారణ అయితే.. బోరుగడ్డ అనిల్ కుమార్ కు భవిష్యత్తులో ఇక ఎప్పటికీ బెయిలు దక్కే అవకాశం లేదని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే.. కోర్టు ఆదేశించినట్టుగా నకిలీ సర్టిఫికెట్ వ్యవహారం తేలేలోగా.. బెయిలు పొందాలని బోరుగడ్డ అనిల్ ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తోంది.
