రౌడీషీటర్ బోరుగడ్డ : హైటెక్ సాక్ష్యాలంటూ వార్నింగులు!

Friday, December 5, 2025

జగన్ మోహన్ రెడ్డి పాలన కాలంలో.. విచ్చలవిడిగా బెదిరింపులకు పాల్పడుతూ దందాలు వసూళ్లు చేస్తూ చెలరేగిపోయిన వ్యక్తుల్లో రౌడీషీటరు బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా ఒకరు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత  కూడా.. పోలీసులు అరెస్టు చేస్తే, గత ప్రభుత్వంలో తాను జగన్మోహన్ రెడ్డికి సలహాదారునని చెప్పుకుంటూ వారినే బెదిరించిన ఘనత ఆయన సొంతం.  తల్లికి అనారోగ్యంగా ఉందని తాను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించాలని తప్పుడు డాక్టరు సర్టిఫికెట్లు సమర్పించి.. కోర్టునే బురిడీ కొట్టించి బెయిలు పొందిన చరిత్ర కూడా ఆయనకు ఉంది.

అలాంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు హైటెక్ సాంకేతికత గురించి మాట్లాడుతున్నారు. హైటెక్ సాక్ష్యాలతో తాను తప్పు చేయలేదని నిరూపిస్తానని, అందుకోసం ఎంత దూరమైనా వెళతానని ఆయన మీడియా ముందు సవాళ్లు విసురుతున్నారు. వివరాల్లోకి వెళితే..
2018లో ఒక చర్చి స్థలం వివాదంలో పోలీసు సర్కిల్ ఇన్స్‌పెక్టరు మురళీకృష్ణను బెదిరించినట్టుగా అప్పట్లోనే అనంతపురం మూడో టౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. చర్చి ఆర్థిక లావాదేవీల్లో తన వర్గానికి సహకరించాలని అప్పట్లో బోరుగడ్డ సీఐకు ఫోన్ చేసి అడిగారు.. ఆయన ఒప్పుకోకపోవడతో బెదిరించారనేది కేసు. అప్పట్లో ఆయన బెయిలు పొందారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సహజంగానే ఈ కేసు గురించి ఎవరూ పట్టించుకోలేదు.

ఇప్పుడు ఆ కేసులో కూడా కదలిక వచ్చింది. ఆ కేసులో బెయిలుపై ఉన్న బోరుగడ్డ వాయిదాలకు హాజరు కాకపోవడతో అనంతపురం మొబైల్ కోర్టు నాన్ బెయిలబుల్ వారంటు జారీచేసింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బోరుగడ్డను పీటీ వారెంటుతో అనంతపురం పోలీసులు తీసుకువచ్చి కోర్టు ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా బోరుగడ్డ మీడియాతో మాట్లాడుతూ.. తాను బెయిలు కోసం తప్పులు చేయనేలేదని, వాటిని నిరూపించడానికి ఎంతదూరమైనా వెళతానని ధీమా వ్యక్తం చేశారు.

ఆయన తన తల్లికి సర్జరీ చేయించాల్సి ఉందని కోర్టుకు నివేదించి గతంలో బెయిలు పొందారు. ఇందుకోసం డాక్టర్ రాఘవశర్మ ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ను కోర్టులో సబ్మిట్ చేశారు. బెయిలు లభించింది. అయితే ఆ తర్వాత ఆయన తల్లి చెన్నై అపోలోలో చేరినప్పటికీ బోరుగడ్డ అక్కడకు పరామర్శ నిమిత్తం వెళ్లనేలేదని పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా గుర్తించారు. తర్వాత ఆయన సమర్పించిన మెడికల్ సర్టిఫికెట్ నకిలీ/ఫోర్జరీ అని తేలింది. డాక్టర్ రాఘవ శర్మ తాను అలాంటి సర్టిఫికెట్ ఇవ్వనేలేదని వాంగ్మూలం ఇచ్చారు. తన సంతకం ఫోర్జరీ అని చెప్పారు. కోర్టు ఈ విషయంలో చాలా సీరియస్ అయింది. తనకు బెయిలు కావాలని ఆయన పిటిషన్ వేయగా, ముందు చేసిన మోసం సంగతి తేలేవరకు బెయిలు సంగతి ఆలోచించం అని చెప్పింది. రాఘవశర్మ నుంచి న్యాయమూర్తి ఎదుట మళ్లీ వాంగ్మూలం రికార్డు చేయాలని ఆదేశించింది.

అయితే బోరుగడ్డ ఈ విషయంలో హైటెక్ సాంకేతికత గురించి మాట్లాడుతున్నారు. బెయిలుకోసం తాను దొంగ సర్టిఫికెటు ఇవ్వలేనదని, ఈ విషయం కోర్టులోనే నిరూపిస్తానని అంటున్నారు. ఇందుకు సీసీ టీవీ ఫుటేజీలు తీయిస్తానని, గూగుల్ టేకవుట్ తో కూడా నిరూపిస్తానని అంటున్నారు. అయినా ఆయన ఒక లాజిక్ మిస్సవుతున్నారు. సీసీ టీవీ ఫుటేజీల్లో బోరుగడ్డ రాఘవశర్మ ఆస్పత్రికి వెళ్లినట్టుగా, ఆయనను కలిసినట్టుగా తెలుస్తుంది తప్ప.. సర్టిఫికెట్ ఆయన ఇచ్చారో లేదో తెలియదు. అలాగే గూగుల్ టేకవుట్ లో కూడా ఆ ఇద్దరూ ఒక సమయంలో ఒకే చోట ఉన్న సంగతి బయటకు వస్తుంది తప్ప.. ఆయన సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలియదు. ఇలాంటి పనికిరాని ఆధారాలకోసం బోరుగడ్డ చెబుతున్నట్టు ఎంత దూరం వెళ్లినా ఉపయోగం లేదు. మీడియా ముందు మేకపోతు గాంభీర్యంతో హైటెక్ మాటలు మాట్లాడినంత మాత్రాన ఆయన మోసం బయటపడకుండా ఆగదని పలువురు విశ్లేషిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles