దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి SSMB29 ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో మేకర్స్ రూపొందిస్తు్న్నారు. అయితే, రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘మహాభారతం’ చిత్రాన్ని తెరకెక్కించాలని ఉందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఈ ఎపిక్ చిత్రాన్ని రూపొందించాలని ఆయన అన్నారు.
అయితే, ఇప్పుడు రాజమౌళి ప్రమేయం ఏమీ లేకుండానే మహాభారతం రూపొందనుంది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే ‘మహాభారత్’ను గ్రాండ్‌గా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు.
ఈ సినిమాను తాను ప్రొడ్యూస్ చేస్తున్నట్లు.. క్యాస్టింగ్, డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడే వెల్లడించలేనని ఆయన చెప్పుకొచ్చారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్‌ను ఇప్పుడు అమీర్ ఖాన్ మొదలు పెడుతుండడంతో ఈ ఎపిక్ సినిమా ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
