వారెవ్వా.. ‘రివర్స్ థియరీ’ జగన్ కు అలవాటే?

Friday, December 5, 2025

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత.. అప్పటికి జరుగుతున్న అన్ని అభివృద్ధి పనులను ఒక్కసారిగా ఆపు చేయించారు. అప్పటికే పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు అందరినీ మార్చేసి, తన మనుషులకు పనులు కట్టబెట్టాలని సంకల్పించారు. దానికి రివర్స్ టెండరింగ్ అంటూ ఒక ముసుగు తొడిగారు. టెండరు కంటె కొంత మొత్తం తగ్గిస్తున్నానంటూ రివర్స్ విధానం అంటూ మాయ చేశారు. అసలు పనులే జరగలేదు. అంతా వ్యవస్థను సర్వనాశనం చేశారు. మొత్తానికి రివర్స్ థియరీలను బాగా వంటబట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు అదే రివర్స్ మాటలతో.. లిక్కర్ స్కామ్ జరుగుతున్న తీరునే పక్కదారిపట్టించాలని చూస్తున్నారు. పోలీసులు విచారణలో తేల్చిన విషయాలన్నీ అబద్ధాలు.. నమోదు అయిన వాంగ్మూలాలు అన్నీ అబద్ధాలు అని తన మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఆయనదంతా రివర్స్ థియరీ లాగా ఉంది.

సాధారణంగా ‘ఒక కుక్కను చంపాలంటే.. ముందుగా అది పిచ్చిదని ముద్ర వేయి’ అనే నానుడి ఉంటుంది. ఇప్పుడు జగన్ ప్రతిపాదిస్తున్న రివర్స్ థియరీ ఏంటంటే.. ‘ఒక పిచ్చి కుక్కను కాపాడాలంటే.. అది పిచ్చిది అనే నివేదికలే తప్పు అని చాటిచెప్పు’ అనేదే! లిక్కర్ స్కామ్ లో తనకు అత్యంత సన్నిహితులు, వసూళ్ల దందాలో కీలకంగా వ్యవహరించిన వారు అందరూ పీకల్దాకా కూరుకుపోతుండడంతో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టుగా తెలుస్తోంది.

పోలీసులు చాలా పక్కాగా.. బెవరేజెస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, ఎక్సైజు అధికారి సత్యప్రసాద్ లనుంచి ముందుగా వాంగ్మూలాలు సేకరించి.. ఆ వాంగ్మూలాల ప్రకారం అందులో పాత్ర ఉన్నట్టుగా తేలిన మిగతా వారికి నోటీసులు ఇస్తూ విచారిస్తున్నారు. అంతా చాలా పక్కాగా ఉండడంతో తప్పించుకోగల అవకాశం వారికి కనిపించడం లేదు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? జగన్ తనకు బాగా తెలిసిన రివర్స్ సిద్ధాంతం అనుసరిస్తున్నారు.

ఏ వాసుదేవరెడ్డి వాంగ్మూలం ఆధారంగా అందరినీ విచారిస్తున్నారో.. ఆ వాంగ్మూలమే తప్పు అని అంటున్నారు జగన్. ఆయన మీద ఒత్తిడి చేసి తప్పుడు వాంగ్మూలం ఇప్పించుకున్నట్టుగా రంగు పులుముతున్నారు. తాము చెప్పినట్టుగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఒత్తిడి చేశారని వాసుదేవరెడ్డి కోర్టులో పిటిషన్లు వేశారని కూడా ప్రస్తావిస్తున్నారు. జగన్ దళాలు పదేపదే చేస్తున్న ఆ రివర్స్ ప్రచారం గమనిస్తే.. వాసుదేవరెడ్డే పిటిషన్ వేశారా? ఆయనతో జగన్ దళాలే బలవంతంగా అలాంటి పిటిషన్ వేయించాయా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి.

ఎటూ విజయసాయిరెడ్డి కూడా వాసుదేవరెడ్డి చెప్పినట్టుగా రెండు లిక్కర్ పాలసీ తయారీ భేటీలు తన నివాసాల్లోనే జరిగినట్టుగా తేల్చారు. మిథున్ రెడ్డి కూడా భేటీలు జరిగిన సంగతి, తాను వెళ్లిన సంగతి తేలుస్తూనే.. అవి లిక్కర్ పాలసీ భేటీలు కాదని బుకాయిస్తున్నారు. అందరూ అదే ఒప్పుకుంటూ ఉండగా.. ఇంకా వాసుదేవరెడ్డితో బలవంతంగా తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని అంటూ.. జగన్ దళాలు ప్రజల్ని ఎంతకాలం ప్రజల్ని మోసం చేయగలమని నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles