జపాన్లో దేవర సక్సెస్‌!

Friday, December 5, 2025

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా డైరెక్టర్‌ కొరటాల శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “దేవర”. అయితే ఈ చిత్రం మన దగ్గర సహా యూఎస్ మార్కెట్ లో రికార్డు వసూళ్లు ఈ చిత్రం అందుకొని రికార్డులు క్రియేట్‌ చేసింది. ఇక ఈ సెన్సేషనల్ రన్ తర్వాత ఇటీవల జపాన్ దేశంలో కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

అయితే జపాన్ లో కూడా దేవర మన దగ్గర నడిచినట్టే సాలిడ్ రన్ ని కొనసాగిస్తుంది అని చెప్పాలి. అక్కడ విజయవంతంగా 3 వారాల రన్ ని కంప్లీట్ చేసుకొని నాలుగో వారంలోకి ఎంటర్ అయ్యినట్టుగా సమాచారం. దీంతో అక్కడ కూడా దేవర సక్సెస్ సాధించింది అని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహించారు. అలాగే అతి త్వరలోనే ఈ చిత్రంకి సీక్వెల్ ని కూడా మేకర్స్ మొదలు పెట్టబోతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles