కసిరెడ్డి దేశం దాటలేదని భ్రమలో ఉన్నారా?

Friday, December 5, 2025

లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడు.. విజయసాయి మాటల్లో చెప్పాలంటే కర్త కర్మ క్రియ అన్నీ తానైన వాడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఈ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ పోలీసులు నాలుగోసారి నోటీసులు అందించారు. అసలు ఒక్కసారి కూడా నోటీసులు అందుకోని వ్యక్తికి, నాకు నోటీసులు ఇచ్చే అధికారం మీకెక్కడుంది అని ప్రశ్నించిన వ్యక్తికి, తొలినోటీసులు అందించిన ప్రయత్నం దగ్గరినుంచి.. పరారీలోనే ఉన్న వ్యక్తికి నాలుగోసారి నోటీసులు ఇవ్వడమే పెద్ద కామెడీగా ఉంది. అయితే ఈ నోటీసులను రాజశేఖర రెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డికి అందించిన పోలీసులు.. కొడుకు ఎక్కడ ఉన్నాడనే వివరాలు ఆయన ద్వారా తెలుసుకోవడానికి ఆయనను 17వతేదీ విజయవాడ కు విచారణ నిమిత్తం రావాలని నోటీసులు కూడా ఇచ్చారు.

ప్రస్తుతానికి రాజ్ కసిరెడ్డితో పాటు ఆయన భార్య కూడా పరారీలోనే ఉన్నారు. ఫోన్లు స్విచాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లడానికి ముందు వారు ఎవరితో మాట్లాడారు.. దానిని బట్టి ఆయన ఎక్కడ దాగి ఉండే అవకాశం ఉంది.. ఆయనకు అవసరమైన డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు.. ఏ మార్గాల్లో.. అనే దిశగా శోధిస్తూ పోలీసులు కొన్ని వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది.

అయితేరాజ్ కసిరెడ్డి ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉండవచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. సిట్ పోలీసులు మాత్రం.. ఆయన మీద చాలా కాలం ముందుగానే .. లుక్ అవుట్ నోటీసులు జారీచేసి ఉన్నందువల్ల విదేశాలకు వెళ్లిపోయే అవకాశం లేదని అంటున్నారు. అయితే అసలు మద్యం కేసు ఎప్పటినుంచి నడుస్తోంది.. సిట్ కేసుల్లోకి నిందితుడిగా కసిరెడ్డి రాజశేఖరరెడ్డి పేరు ఎప్పుడు వచ్చి చేరింది… లుక్ అవుట్ నోటీసులు ఎప్పుడు జారీ అయ్యాయి.. అనే వివరాలన్నీ తేదీలసహా ఖచ్చితంగా వెలుగులోకి వస్తే తప్ప ఆయన అసలు దేశంలో ఉన్నారా లేదా అనేది తేలడం కష్టం.

ఒకవేళ రాజ్ కసిరెడ్డి.. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడే గానీ.. లేదా సిట్ ఏర్పాటు అయినప్పుడే గానీ.. విదేశాలకు వెళ్లిపోయిఉంటే పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతోంది. రాజశేఖర రెడ్డి పాస్ పోర్టు ఉపయోగించి.. గత ఏడాదిగా ఏమైనా అంతర్జాతీయ ప్రయాణాలు జరిగాయో లేదో.. వివరాలు సేకరిస్తే.. కొంత ఫలితం ఉంటుంది కదా.. అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. సిట్ పోలీసులు కూడా దేశం దాటిఉండకపోవచ్చు అంటున్నారే తప్ప.. ఆ విషయం ఖరారుగా చెప్పడం లేదు. దేశం దాటి పోయారు అనే అనుమానంతో.. ఆ దిశగా కూడా పరిశోధన సాగించాల్సిన, అలాంటి సందర్భాల్లో ఆచూకీ కనుక్కునే మార్గాన్వేషణ చేయాల్సి ఉందని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles