రాష్ట్రంలో భారీస్థాయిలో ఉన్న ఆక్వా పరిశ్రమ ట్రంప్ సుంకాల ధాటికి కుదేలై దెబ్బతినకుండా ఉండడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్వయంగా రంగంలోకి దిగారు. ఆక్వా రైతులకోసం ప్రత్యేక శ్రద్ధ చూపించి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చర్చలు జరపాల్సిందిగా చంద్రబాబునాయుడు.. కేంద్రాన్ని కోరుతున్నారు. ట్రంప్ ఇతర దేశాల నుంచి వచ్చే అన్ని రకాల దిగుమతుల మీద విపరీతంగా పన్ను భారం విధిస్తూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రపంచమంతా ఈ విషయంలో అతలాకుతలం అవుతున్న సమయంలో.. ఏపీలోన ఆక్వా పరిశ్రమ నాశనం కాకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు పనిగట్టుకుని రంగంలోకి దిగారు. ఆక్వారంగంపై పన్నుల విషయంలో ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని కోరుతూ ట్రంప్ తో చర్చలు జరపాల్సిందిగా చంద్రబాబు.. కంేద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు లేఖ రాశారు.
డొనాల్డ ట్రంప్- భారత ప్రధాని నరేంద్రమోడీ మధ్య మంచి సన్నిహిత సంబంధాలే ఉన్నాయనే సంగతి అందరికీ తెలుసు. అయితే సుంకాల విషయంలో మాత్రం ఎలాంటి శషబిషలు లేకుండా అన్ని దేశాలకు కూడా సమానంగా ట్రంప్ వడ్డించేశారు. ఆక్వారంగం తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి. దీంతో ఈ ఒక్క రంగం గురించి ట్రంప్ ప్రత్యేకంగా పరిగణించాలనే చంద్రబాబు కోరిక.
భారతదేశం రనుంచి వియత్నాం, థాయ్ లాడ్, జపాన్ వంటి దేశాలు సముద్ర ఉత్పత్తులను కొనుగోలు చేసుకుని.. అక్కడ ప్రాసెస్ చేసి తర్వాత అమెరికాకు విక్రయిస్తుంటారు. ఆయా దేశాలకు కూడా పన్ను భారం విపరీతంగా పెరగడంతో.. భారత్ నుంచి కొనుగోలు చేయడానికి ఆ దేశాల్లోని ప్రాసెసింగ్ కంపెనీల వారు, గతంలో పెట్టిన ఆర్డర్లనే రద్దు చేసుకున్నారు. దీంతో భారతీయ ఆక్వా రంగం కుదేలవుతోంది.
ఈ అంశాలన్నిటినీ చంద్రబాబు పీయూష్ గోయల్ దృష్టికి తీసుకువెళుతూ.. లక్షల మంది జీవనోపాధనిని కాపాడడానికి ప్రఃభుత్వాలు శ్రద్ధ చూపించాని కోరుతున్నారు.
ఆక్వా రంగానికి చాలా నష్టం వాటిల్లుతోంది. ఒకవైపు అమెరికాలోని సంస్థలు కూడా ఆర్డర్లు రద్దు చేస్తున్నాయి. మరొకవైపు ఇండియానుంచి కొని, అమెరికాకు విక్రయించే ఇతర దేశాలు కూడా ఆర్డర్లను రద్దుచేశాయి. డెలివరీకి పంపడానికి కంటెయినర్లలో రొయ్యల లోడ్ ను సిద్ధం చేసిన భారతీయ వ్యాపారలు ఈ పిడుగుపాటుకు తట్టుకోలేకపోతున్నారు. కంటెయినర్లు ఆగిపోయాయి. ఆల్రెడీ కోల్డ్ స్టోరేజీలన్నీ రొయ్యలతో నిండుగా ఉన్నాయి. కొత్తగా చెరువుల్లో చేపలు, రొయ్యలు పడితే ఎక్కడ పెట్టాలో కూడా రైతులకు స్పష్టత ఉండడం లేదు. చంద్రబాబు కోరుకుంటున్నట్టగా కేంద్రం ట్రంప్ వైఖరిలో మార్పు తేగలితగితే.. రాష్ట్రానికి చాలా మేలు జరుతుుంది.
ఆక్వా రంగం బాగుకోసం రంగంలోకి చంద్రబాబు!
Monday, April 21, 2025
