రిపీట్ మోడ్‌!

Friday, December 5, 2025

రిపీట్ మోడ్‌! ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ చిత్రాల్లో దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా కూడా ఒకటి. ఈ సినిమాని అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ఈ మూవీ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో మెగాస్టార్ నుంచి మనం మిస్ అవుతున్న కామెడీ జోనర్‌ను మనముందుకు తీసుకురాబోతున్నాడు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఇక ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి వార్త వచ్చినా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ సినిమా కోసం దర్శకుడు అనిల్ రావిపూడి రిపీట్ మోడ్‌లోకి మారుతున్నాడట. ఈ సినిమా కోసం తన లాస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి పనిచేసిన టెక్నికల్ టీమ్‌ను మరోసారి రిపీట్ చేయనున్నాడట ఈ డైరెక్టర్. మెగాస్టార్ చిరంజీవి మూవీకి సంగీతం భీమ్స్ సిసిరోలియోతో చేయించుకోవాలని.. సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తిమ్మరాజు తో పాటు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ మొత్తం ఈ సినిమాకు వర్క్ చేయబోతున్నారట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన టీమ్‌ను మరోసారి రిపీట్ చేయనుండటంతో మెగాస్టార్ చిరంజీవి మూవీ కూడా ఖచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles