ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు క్రియేట్ చేసి బన్నీ స్టామినా ఏమిటో ప్రూవ్ చేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న బన్నీ, ప్రస్తుతం తన నెక్స్ట ప్రాజెక్ట్ టేకప్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, బన్నీతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో హ్యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. ఇక తన నెక్స్ట్ చిత్రాన్ని కూడా బన్నీతో చేయబోతున్నట్లు గతంలో వెల్లడించాడు ఈ స్టార్ డైరెక్టర్.
అయితే, ‘పుష్ప-2’ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. కానీ, ఈసారి త్రివిక్రమ్ చాలా బలమైన కథతో రాబోతున్నాడని తెలుస్తోంది. అందుకే స్టోరీ రైటింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ముందుకెళ్తున్నాడట. దీంతో ఈ కాంబోలో సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా నిర్మాత నాగవంశీ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
బన్నీతో త్రివిక్రమ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇప్పట్లో పట్టాలెక్కదని.. 2025 ద్వీతీయార్థంలోనే ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఆయన తాజాగా కామెంట్ చేశారు. దీంతో బన్నీ-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కు మరికొంత సమయం పడుతుందని తేలిపోయింది