ఇక నుంచి అలాంటి సినిమాలే చేస్తాను!

Friday, December 5, 2025

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవల ‘లైలా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్ట్ చేయగా ఈ మూవీ కంటెంట్ పరంగా వీక్‌గా ఉండటంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేశారు. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర కొద్దిరోజులకే ఫేడవుట్ అయిపోయింది. ఇక ఈ సినిమాపై విశ్వక్ మంచి హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఫలితం దారుణంగా రావడంతో ఆయన తాజాగా దీనిపై స్పందించాడు.

విశ్వక్ తన అభిమానులను ఉద్దేశించి తాజాగా ఓ ప్రకటన విడుదల చేశాడు. తాను చేసే సినిమాలపై నమ్మకంతో ఇంతకాలం తనను ఆదరించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. గత కొంతకాలంగా తన నుంచి మంచి సినిమాలు రావడం లేదని అభిమానులు అంటున్నారని.. వారి మాటలను తాను గౌరవిస్తున్నానని.. ఇకపై తాను చాలా జాగ్రత్తగా కథలు ఎంచుకుంటానని.. ఎలాంటి వల్గారిటీ లేని కామెడీ చేస్తానని విశ్వక్ పేర్కొన్నాడు.

తన సక్సెస్‌తో పాటు ఫెయిల్యూర్స్‌లోనూ తోడున్న అభిమానులకు తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని విశ్వక్ ఈ సందర్భంగా తెలిపాడు. ఇకపై తన సినిమాలు చూసి అభిమానులు కాలర్ ఎగరేసుకునేలా చేస్తానని విశ్వక్ సేన్ పేర్కొన్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles