టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. తనదైన టేకింగ్‌తో వెర్సటైల్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి తండ్రిగారు కన్నుమూశారు. ఏలేటి సుబ్బారావు(75) గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా తుని మండలం రేఖవానిపాలెం లో నివాసముంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది.
మరో విషాదం హీరో కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఇంట్లో చోటు చేసుకుంది. రాహుల్ రవీంద్రన్ తండ్రిగారు రవీంద్రన్ నరసింహన్ కన్నుమూశారు. ఈ విషయాన్ని రాహుల్ స్వయంగా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తన తండ్రితో తనకు ఉన్న అనుబంధాన్ని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇలా టాలీవుడ్‌కి చెందిన ఓ యాక్టర్, ఓ డైరెక్టర్ తండ్రులను కోల్పోవడంతో అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. పలువురు టాలీవుడ్ ప్రముఖులు వారికి తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
