గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి గుర్తింపు లభించిందో మనం చూశాం. ఆయన నటన, డ్యాన్స్‌లకు వరల్డ్‌వైడ్‌గా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక గ్లోబల్ స్టార్‌కు కామన్ ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రిటీ అభిమానుల సంఖ్య కూడా ఎక్కువనే చెప్పుకోవచ్చు. వారిలో భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కూడా ఓ అభిమాని.
తాజాగా ముంబైలో జరుగుతున్న ISPL టీ10 పోటీల్లో రామ్ చరణ్ సొంత జట్టు ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్ కూడా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ పోటీల్లో తన జట్టును ఉత్సాహ పరిచేందుకు చరణ్ ముంబై చేరుకున్నాడు. అక్కడ మహ్మద్ కైఫ్ చరణ్‌ను కలిసి ఆయనతో కొంతసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌తో ఓ ఫోటో దిగి తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టాడు మహ్మద్ కైఫ్.
ఈ సందర్భంగా.. ‘‘అతడిని కలిస్తే, మనకి కూడా నాటు నాటు స్టెప్పు వేయాలనిపిస్తుంది. ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా కూడా ఒదిగి ఉండటం ఆయన ప్రత్యేకత. ఆయన మనందరినీ గర్వపడేలా చేశారు. ఆయనకు మరిన్ని హిట్స్ రావాలని కోరుకుంటున్నా..’’ అంటూ మహ్మద్ కైఫ్ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోను అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
