నేచురల్‌ స్టార్‌ మూవీ పై ఇంట్రెస్టింగ్‌ బజ్‌!

Tuesday, April 1, 2025

నేచురల్‌ స్టార్‌ మూవీ పై ఇంట్రెస్టింగ్‌ బజ్‌! నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’. యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఈ మూవీని రూపొందిస్తున్నాడు. పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట ఈ మూవీ.

అయితే నాని అభిమానులను ఉత్సాహపరిచేందుకు, నిర్మాతలు త్వరలో ఒక స్పెషల్ గ్లింప్స్‌ను విడుదల చేయాలని అనుకుంటున్నారంట. ఈ గ్లింప్స్ దాదాపుగా రెడీ అయిందని తెలుస్తోంది. కానీ, అనిరుధ్ రవిచందర్ ఇంకా బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ను పూర్తి చేయలేదు అని, ప్రస్తుతం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ వర్క్ జరుగుతుందని సమాచారం.

కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ గ్లింప్స్ ఫిబ్రవరి 20, 2025న విడుదల అవుతుందట. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles