సీఎం పీకే!

Friday, December 5, 2025

ప్రస్తుతం ఓటిటిలు మన ఇండియాలో కూడా ఆడియెన్స్ కి ఎంతలా రీచ్ అయ్యాయో అందరికీ తెలిసిన విషయమే. అలా మన తెలుగు నుంచి కూడా పలు ఓటిటి యాప్స్ ఆడియెన్స్ కి అలరించేందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇలా మన తెలుగు నుంచి వచ్చిన మొదటి స్ట్రీమింగ్ యాప్ నే “ఆహా”. అల్లు సంస్థ నుంచి వచ్చిన ఈ ఓటిటి యాప్ చాలా తక్కువ  కాలంలోనే మంచి ఆదరణ పొందింది.

అలాగే పలు ఒరిజినల్ సినిమాలు, సిరీస్ లతో లాక్ డౌన్ సమయం నుంచి ఇపుడు సాలిడ్ ట్రీట్ అందించగా ఇపుడు వీరి నుంచి ఒక సెన్సేషనల్ అనౌన్సమెంట్ విడుదలైంది. “సీఎం పీకే” అంటూ ఒక పోస్టర్ ని విడుదల చేసి అందరిలో కొత్త ఆసక్తిని రేపారు. టాలీవుడ్ లో పీకే అంటే ఎవరికైనా  ముందుగా
గుర్తుకు వచ్చే పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.

పైగా పవన్ రాజకీయాల్లో ఉండడంలో సీఎం పీకే అనేది పెద్ద పదమే ఇపుడు. దీనితో ఇలాంటి ట్యాగ్ ని అనౌన్స్ చేసి అతి త్వరలోనే ఒక పవర్ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని తీసుకొస్తున్నట్టుగా ఆహా వారు చెబుతున్నారు. మరి ఈ టైటిల్ వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏంటి అనేది ముందు రోజుల్లో చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles