3బీహెచ్‌కే అంటూ వచ్చేస్తున్న సిద్దార్థ్‌!

Friday, December 5, 2025

హీరో సిద్ధార్థ్ హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఇక సిద్ధార్థ్ నటించే సినిమాలను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. అయితే, ఆయన నటిస్తున్న తాజా సినిమాని శ్రీ గణేష్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు టైటిల్ టీజర్‌ను తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది చిత్ర బృందం.

ఈ చిత్రానికి ‘3BHK’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ప్రతి మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ టైటిల్ టీజర్ చూస్తే తెలుస్తుంది. సాధారణ గుమాస్తా అయిన ఓ తండ్రి, ఇంట్లో అందరి పనులు చూసుకునే తల్లి.. వారికి ఓ కొడుకు, కూతురు.. వారి కల.. అనే నేపథ్యంలో ఈ సినిమా రానున్నట్లు ఈ టైటిల్ టీజర్ లో తెలుస్తుంది.

ఇక ఈ మూవీలో శరత్ కుమార్, దేవయాని, మీతా రఘునాథ్, చైత్ర, యోగిబాబు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్యూర్ ఫ్యామిలీ సబ్జెక్ట్‌గా రానున్న ఈ సినిమాకు అమ్రిత్ రామ్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles