దాని గురించి తమన్‌ ఏమన్నాడంటే!

Thursday, February 20, 2025

దాని గురించి తమన్‌ ఏమన్నాడంటే! గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఈ సినిమాను డైరెక్టర్‌ బాబీ కొల్లి డైరెక్ట్ చేయగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది.

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌కు రాబోతుంది. అయితే, ఈ చిత్రాన్ని ఓటీటీ ప్రేక్షకుల కోసం మరింత ప్రత్యేకంగా తీసుకురానున్నట్లు థమన్ చెప్పారు.

ఈ సినిమాను డాల్బి ఔట్‌పుట్‌తో తీసుకురాబోతున్నట్లు థమన్ తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి అనుభవాన్ని కలిగిస్తుందని ఆయన తెలిపారు.ఇలా డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై థమన్ అంచనాలు పెంచేయడంతో ఇప్పుడు అందరూ ఈ సినిమాను ఎప్పుడెప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles