జాట్‌ విడుదల ఎప్పుడంటే!

Sunday, January 26, 2025
జాట్‌ విడుదల ఎప్పుడంటే! బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటించిన “గదర్ 2” తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత టాలీవుడ్ డైరెక్టర్‌ గోపీచంద్ మలినేనితో ఓ సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ “జాట్” చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొనగా మేకర్స్ షూటింగ్ ని శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఆల్రెడీ వచ్చిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేసుకున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

దీంతో ఈ అవైటెడ్ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదలకి వస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి ఇన్ని రోజులు హిందీ వెర్షన్ లోనే అని అంతా అనుకున్నారు కానీ ఈ అప్డేట్ తోనే మేకర్స్ సాలిడ్ హిందీ మాత్రమే కాకుండా తెలుగు సహా తమిళ్ లో కూడా విడుదలకి తీసుకొస్తున్నట్టుగా తేల్చి చెప్పారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles