తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజా సినిమా ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాను దర్శకుడు ఎస్‌యు అరుణ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా పోస్టర్స్ ఈ మూవీపై మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.
అయితే, ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. వీర ధీర శూరన్ పార్ట్ 2 చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. తొలుత ఈ సినిమాను 2025 పొంగల్ బరిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అజిత్ నటించిన విదాముయార్చి మూవీ విడుదల ప్రకటించడంతో విక్రమ్ సినిమా వాయిదా పడింది.
ఇక ఇప్పుడు మార్చి 27న ఈ మూవీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో దాషార విజయన్ హీరోయిన్‌గా నటిస్తుండగా జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.