తెలుగులో విశాల్ ‘మదగజరాజ’ విడుదల తేదీ ఫిక్స్‌!

Thursday, January 23, 2025

తెలుగులో విశాల్ ‘మదగజరాజ’ విడుదల తేదీ ఫిక్స్‌! తమిళ హీరో విశాల్ కొన్నేళ్ల కిందట నటించిన ఓ సినిమా ఇటీవల సంక్రాంతి బరిలో విడుదల అయ్యింది. ‘మదగజరాజ’ అనే ఈ సినిమాను డైరెక్టర్ సుందర్.సి డైరెక్ట్ చేశారు.

కొన్ని కారణాల వల్ల విడుదల ఆగిపోయిన ఈ సినిమాను పొంగల్ కానుకగా విడుదల చేశారు. అయితే, ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాలోని కంటెంట్ కామన్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేసే విధంగా ఉండటంతో ఈ మూవీ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాకు తమిళనాట వచ్చిన రెస్పాన్స్‌తో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు.

‘మదగజరాజ’ చిత్రాన్ని జనవరి 31న తెలుగులో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.దీంతో ఈ సినిమా ఇక్కడి ఆడియెన్స్‌ను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాలో అంజలి, వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోయిన్లుగా నటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles