టాలీవుడ్ క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప 2’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్, ప్రస్తుతం కొంత బ్రేక్ తీసుకుంటున్నారు.
అయితే, ఆయన తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుతో చేతులు కలిపేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై ఆశిష్ రెడ్డి హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘సెల్ఫిష్’ . ఈ సినిమా గతంలోనే తెరకెక్కాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్‌తో పాటు సుకుమార్ రైటింగ్స్ కూడా ప్రొడ్యూస్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. దీంతో ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు. ఈ సినిమాను కాశీ విశాల్ డైరెక్ట్ చేస్తున్నారు.ఈ సినిమాలో ఇవానా హీరోయిన్‌గా చేస్తోంది.