అందుకు ఒప్పుకోని అభిమానులు! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, కియారా అద్వానీ, అంజలి కథానాయికులుగా యాక్ట్ చేసిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ తర్వాత చరణ్ యువ దర్శకుడు బుచ్చిబాబు సానాతో ఒక సాలిడ్ రూరల్ యాక్షన్ డ్రామా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతుంది. అయితే తాజాగా మళ్ళీ సినిమా టైటిల్ పై పలు రూమర్స్ మొదలయ్యాయి. ఎప్పటి నుంచో ఉన్న టైటిలే “పెద్ది” ని మేకర్స్ లాక్ చేసేసారు అన్నట్టుగా మళ్ళీ రూమర్స్ వినపడుతున్నాయి. నిజానికి ఈ టైటిల్ వేరే సినిమాకి బుచ్చిబాబు పెట్టుకుంది అన్నట్టుగా టాక్. అలాగే ఆ సబ్జెక్టుకి ఇపుడు చరణ్ చేస్తున్న సబ్జెక్టుకి కూడా ఎలాంటి సంబంధం లేదని సమాచారం. ఇక ఇపుడు వైరల్ అవుతున్న టైటిల్ కి అభిమానులు కూడా ససేమిరా నో అనే సోషల్ మీడియాలో గట్టిగా చెబుతున్నారు. మరి మేకర్స్ ఈ చిత్రానికి ఏ టైటిల్ పెడతారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ .