చరణ్ 16 పై సాలిడ్ బజ్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా “గేమ్ ఛేంజర్” గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం తర్వాత చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై కూడా భారీ హైప్ నెలకొనగా ఈ సినిమా షూటింగ్ సహా ఇతర అంశాలపై సాలిడ్ బజ్ తెలుస్తుంది. దీంతో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ని ఈ జనవరి 27 నుంచి మొదలు పెడుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే షూటింగ్ ని మాత్రం పక్కా ప్లానింగ్ ప్రకారం కంప్లీట్ చెయ్యాలనే చిత్ర బృందం అనుకుంటున్నారట. దాదాపు ఈ ఏడాది జులైకి పూర్తి చేసేస్తారని తెలుస్తుంది. అలాగే దాదాపు ఈ దసరా రేస్ లో లేదా డిసెంబర్ నెల లోనే విడుదల చేసేస్తారని టాక్ వినపడుతుంది. ఇక ఈసినిమాకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.