బాలయ్య బాబు టైటిల్‌ తో శర్వా!

Saturday, January 25, 2025

బాలయ్య బాబు టైటిల్‌ తో శర్వా! యంగ్ హీరో శర్వానంద్ నటిస్తున్న 37వ చిత్ర షూటింగ్ ఇప్పటికే ఫుల్ ఫ్లెడ్జ్‌తో నడుస్తుంది. ఈ సినిమాకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రెడీ అవుతుంది. ఇక ఈ సినిమాలో శర్వానంద్ పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినిమా బృందం తెలిపింది.

అయితే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను సంక్రాంతి కానుగా మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘నారీ నారీ నడుమ మురారి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర బృందం కన్ఫార్మ్‌ చేసింది.. ఈ సినిమాలో అందాల భామలు సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ టైటిల్‌ను ఇప్పుడు శర్వా సినిమాకు వాడటంతో ఈ మూవీ ఎలాంటి ఫలితాలను అందుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : admin@andhrawatch.com

Latest Articles