మాస్‌ రికార్డుల హీరో ఒకే ఒక్కడు!

Wednesday, January 15, 2025

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా సినిమా ‘డాకు మహారాజ్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ టాక్‌తో ముందుకు దూసుకుపోతుంది. ఈ సినిమాకి దర్శకుడు బాబీ దర్శకత్వం వహించగా పక్కా కమర్షియల్ అంశాలతో తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలో బాలయ్య నటనకు ప్రేక్షకులు మంత్రముగ్ధులవుతున్నారు.

సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ మూవీ సాలిడ్ వసూళ్లు అందుకుంటుంది. ఇప్పటికే 1 మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి ‘డాకు మహారాజ్’ ఎంటర్‌ అయిపోయిందిది. బాలయ్య వరుసగా నాలుగు చిత్రాలతో ఈ ఫీట్ సాధించారు.

సీనియర్ హీరోల్లో వరుసగా నాలుగు సినిమాలను 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో చేర్చిన హీరోగా బాలయ్య సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ చిత్రాలతో బాలయ్య ఈ ఫీట్ మరోసారి అందుకున్నాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles