మోక్షు ఎంట్రీ అప్పుడే! నటసింహం బాలయ్య బాబు వారసుడిగా ‘నందమూరి మోక్షజ్ఞ’ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో రాబోతున్న సినిమా ఓపెనింగ్ అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా పై చాలా రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో మోక్షజ్ఞ రెండో సినిమా పై ఇప్పుడు రూమర్లు వినపడుతున్నాయి. ఆదిత్య 999 సినిమానే మోక్షజ్ఞ మొదటి సినిమా, ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తుంది.
రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నట్లు , అంతేకాకుండా బాలయ్య తన ఆలోచనలతో ఈ స్క్రిప్ట్ రెడీ అవుతుందని తెలుస్తుంది.. ఈ సినిమాకి బాలకృష్ణ స్వయంగా డైరెక్షన్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అటు మోక్షు కూడా ఆదిత్య 999పై ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఆ మధ్య తన వారసుడి ఎంట్రీ పై బాలయ్య మాట్లాడుతూ.. ‘మోక్షును ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో నాకు తెలుసు. మోక్షజ్ఞ కోసం ఒక ఐదు ఆరు స్క్రిప్ట్స్ నా మైండ్ లోనే రెడీగా ఉన్నాయి’ అని బాలయ్య చెప్పిన సంగతి తెలిసిందే.