టాలీవుడ్‌లో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల జోరు నడుస్తోంది. ఈ జాబితాలో తెరకెక్కుతున్న మరో భారీ పాన్ ఇండియా సినిమా ‘స్వయంభూ’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈ సినిమాలో మరో సాలిడ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను భరత్ కృష్ణమాచారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా మేకర్స్ రూపొందిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ సాలిడ్ అప్డేట్ అయితే ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ‘స్వయంభూ’ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం చిత్ర యూనిట్ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ స్టూడియోకు వెళ్లారు. ఈ మేరకు అక్కడ దిగిన ఫోటోలను వారు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
ఈ సినిమాకు ఆయన ఎపిక్ అండ్ పవర్‌ఫుల్ మ్యూజిక్ కంపోజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ చెప్పింది. ఈ సినిమాలో అందాల భామలు నభా నటేష్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా చేస్తున్నారు.