నందమూరి నటసింహం బాలయ్య బాబు – దర్శకుడు బాబీ కాంబోలో “డాకు మహారాజ్” సినిమా సంక్రాంతి కానుకగా గ్రాండ్ విడుదలకు సిద్దమవుతుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న అనంతపురంలో జరుగుతుందని సమాచారం. ఈ ఈవెంట్‌కు బాలయ్య అల్లుడు, మంత్రి నారా లోకేశ్ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఈవెంట్ కోసం ఏర్పాట్లు భారీ ఎత్తున చేపడుతున్నారు.
ఇక “డాకు మహారాజ్” సినిమా జనవరి 12, థియేటర్లలో సందడి చేసేందుకు సిద్దంగా ఉంది. కాగా ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ , ప్రగ్యా జైస్వాల్ కథానాయికలుగా నటించిన విషయం తెలిసిందే.