అఖండ 2 పై తాజా అప్డేట్‌!

Wednesday, January 8, 2025

నందమూరి నటసింహం బాలయ్య బాబు– బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన ‘అఖండ’ అద్భుత విజయాన్ని అందుకుంది. దీంతో, ‘అఖండ 2 – తాండవం’ పై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ కోసం బోయపాటి ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం నుంచి సినిమాలోని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేయడానికి బోయపాటి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, ఈ షూట్ లో బాలయ్య జాయిన్ అవ్వడు అని అయితే సమాచారం. ఈ షెడ్యూల్ అనంతరం ఫిబ్రవరి రెండో వారంలో జరగబోయే షెడ్యూల్ ను పూర్తిగా బాలయ్య పై ప్లాన్ చేస్తున్నారని సమాచారం. కాగా ప్రస్తుతం ఈ సినిమాలో నటించే నటీనటులను బోయపాటి ఎంపిక చేసే పనిలో పడ్డారు. మరోవైపు లొకేషన్స్ ను కూడా ఇప్పటికే బోయపాటి ఫైనల్ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో హ్యాట్రిక్ విజయాలు ఉన్నవిషయం తెలిసిందే

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles